Step into an infinite world of stories
3.6
Fantasy & SciFi
జీవితమే ఓ ఢమాల్
నవ్వుల మల్లిక్...అదే కార్టూనిస్ట్ మల్లిక్... చెయ్యి ఓ మూడునాలుగు మెలికలు తిరిగిన రచయిత కూడా అని మనకు తెలిసిందే. ఆయన చేతిని వీర తిప్పుడు తిప్పి రాసిన నవలల్లో పాపులర్ రచన ఏదంటే ఏం చెప్తాం? ఏమో ఏదీ అని కచ్చితంగా చెప్పటం కష్టమే. అందుకే చాలా కష్టపడి ఒక బెస్ట్ బయటికి తీయాలంటే మాత్రం "జీవితమే ఒక డమాల్" అనుకోవల్సిందే. చదువుతూ నవ్వి, ఆ కథ పక్కవాళ్లకి చెబుతూ మళ్ళీ నవ్వి, అప్పుడప్పుడూ గుర్తు చేసుకొని మళ్లీ మళ్లీ నవ్వుకునేది కథ ఈ జీవితమే ఓ డమాల్. ఒకప్పుడు వచ్చిన ఓ యమలోకం సినిమా ఫ్లేవర్ ని మళ్ళీ చిన్న తాళింపు పెట్టి చివర్లో అతికించి తెగ నవ్వించే నవల. పాపం.... యమలోకంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల దారుణంగా చనిపోయిన మోహన్ చివరికి మహా దారుణంగా ఓ శరీరంలోకి వెళ్లాల్సి వస్తుంది. అయితే అది ఒక ఆడ శరీరంలోకి. అంటే ఒక జన్మ రెండు మరణాలూ, రెండు జెండర్లూ అన్నమాట. ఇక ముందునుంచీ చదువుకుంటూ వస్తే నవ్వలేక అవస్తే మరి... ఒక కథని చెబుతూనే ఇంత కామెడీ నడిపించటం అంత ఈజీ విషయం కాదు. కానీ జీవితమే ఓ డమాల్ మాత్రం ఆధ్యంతం, అనంతరం కూడా నవ్విస్తూనే ఉంటుంది... 90లలో ఓ వీక్లీలో సీరియల్ గా వచ్చిన ఈ నవలకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారంటేనే ఈ డమాల్ కథ ఎంతలా సూపర్ హిట్ కొట్టిందో అర్థం చేసుకోవాలి మరి.
Cartoonist Mallik is known as a humorous writer. His humorous writings are always impressive enough to tickle our bones. There are many writings on his name but Jeevithame Oka Dhamaal stands out as the best. Just like the film Yamalokam, the story also revolves around a pinch of socio-fantasy with humor elements. Because of a mistake that takes place in Yamalokam, Mohan dies and gets into the body of a woman. The drama begins then with twists and turns of comedy. The story was published as a weekly serial in the 90s. There are still fans for this wonderfully funny story.
© 2021 Storyside IN (Audiobook): 9789354838576
Release date
Audiobook: 3 October 2021
English
India