Step into an infinite world of stories
కాశీభట్ల వేణుగోపాల్ వ్రాసిన ‘తపన’ 1999 సంవత్సరానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్వాతి పత్రికతో సంయుక్తంగా నిర్వహించిన రెండవ నవలల పోటీలో లక్ష రూపాయల ఏకైక బహుమతి పొందింది. ఈ నవలలో కథావస్తువు, పాత్ర చిత్రణ, కథనశైలి, భాషా ప్రయోగం చాలా ప్రత్యేకమైనవి. మామూలు నవలలో కనిపించనివి. దాంపత్య సంబంధాలు కథావస్తువుగా చాలా నవలలు, కధలూ వచ్చాయి. కానీ, ఈ నవలలో భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఇంతకు ముందు ఏ తెలుగు నవలలోనూ చూసిన గుర్తులేదు. మనుషులకు తమ గురించీ, తమ మనస్సు గురించీ, తమ ప్రవర్తనల గురించీ స్పష్టంగా తెలుసుననుకోవటం చాలావరకు భ్రమ మాత్రమే అని మానసిక శాస్త్రం వాదం. కథ నడిచిన నాలుగు రోజుల వ్యవధిలో కథానాయకుడు తనగురించీ, తన భార్య గురించీ, తన జీవితం గురించీ కొత్త సత్యాలను తెలుసుకుంటాడు. ఈ పరిణామాలు మనకు కొంత ఆశ్చర్యంగా అనిపించినా, అసహజం మాత్రం కావు. తెలుగులో చైతన్య స్రవంతి శైలిలో వచ్చిన బహుకొద్ది నవలలలో ‘తపన’ ఒకటి. చైతన్య స్రవంతి పద్ధతిలో సాగే రచనలు స్పష్టంగానూ, అస్పష్టంగానూ మన ఆలోచనల్లో జొరబడే అనేక సంకేతాలతో నిండి ఉంటాయి.
© 2022 Storyside IN (Audiobook): 9789355446466
Release date
Audiobook: 30 June 2022
English
India