Step into an infinite world of stories
Sahaja - Volga: A story of four friends whose lives take different paths after marriage. When they realise that marriage and family have reconstructed their lives and destroyed their creativity, they attempt to free themselves of the shackles of oppression. Volga is the pen name of Popuri Lalitha Kumari. Born on the 27th day of November in 1950, Volga completed her M.A. in Telugu literature at Andhra University in 1972. She worked as a lecturer in Telugu at VSR & NVR College, Tenali from 1973 to 1986. Between 1986 and 1995, she worked as a senior executive for Usha Kiron Movies, Hyderabad. She was the executive president of Asmita Resource Centre for Women from 1991 to 1997. She is currently (2001) the General Secretary of Asmita, a member of the editorial collective for vaMTiMTi Masi (Soot from the Kitchen) - a feminist publishing house and a member of the Telugu advisory panel for National Book Trust of India.
వాళ్ళు నలుగురు! కాలేజీ రోజుల్నుంచీ వున్న ప్రాణస్నేహం ఆ నలుగుర్నీ ఆ తర్వాత కూడా సన్నిహితంగా బంధించి వుంచింది. ఒకరికి చిత్రలేఖనంలో అభినివేశం! మరొకరికి సంగీతంపై అభిరుచి! ఇంకొకరికి పుస్తక పఠనాభిలాష! ఆ ముగ్గురి ఇష్టాలపై రెట్టింపు ఇష్టాన్ని పెంచుకుంది నాల్గవ నేస్తం! ఆ ప్రభావంతో... ''స్నేహం, ప్రేమ నాజీవితాశయం'' అని చెప్పుకున్న సహజకి ఆతర్వాత ఎదురయిన అనుభవాలేమిటి? చివరికి ఆమె - ''చిన్నప్పటి నుంచీ మీరే - పాటలు పాడీ, బొమ్మలు వేసీ, దొరికిన పుస్తకమల్లా నా చేత చదివించీ, నా కీ పిచ్చి ఎక్కించారు. ఇపుడు మీరు హాయిగా సంసారాలు చేసుకుంటుంటే నేనింకా ఈ పిచ్చిలోనే పడి కొట్టుకుంటున్నాను'' అని ఎందుకు అనవలసి వచ్చింది. ఆమె అలా తన స్నేహితురాళ్ళపై మోపిన ఆ అభియోగంలోని వాస్తవం ఏమిటి? మన పురుషాధిక్య సమాజంలో వివాహానంతరం స్త్రీ జీవితం చెందే పరిణామాల్ని, భిన్నస్వభావాలు గల భర్తలకనుగుణంగా భార్యలు అవలంభిస్తున్న రాజీ మార్గాల్ని ఆలోచనలు రేకెత్తించే విధంగా చిత్రించిన ఓల్గా రచన ''సహజ''.
© 2021 Storyside IN (Audiobook): 9789354834912
Release date
Audiobook: 4 August 2021
English
India