Step into an infinite world of stories
5
Personal Development
విజయానికి అయిదు మెట్లు పుస్తకం మార్కెట్లో రిలీజ్ అయిన నెల రోజుల్లో మొదటి ఎడిషన్ పూర్తిగా అమ్ముడయి రికార్డు సృష్టించింది. (‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవల రిలీజ్ అయిన మొదటి రోజే కాపీలన్నీ అమ్ముడయి రికార్డునెలకొల్పింది. అయితే దాని ధర అప్పట్లో రూ.15/ మాత్రమే).
ఎలక్ట్రానిక్ రంగపు ఉధృతానికి నవలా రచయితలందరూ దాదాపు అస్త్ర సన్యాసం చేసిన రోజుల్లో ఈ పుస్తకం విజయం అనూహ్యం.
తెలుగులో ఎందరో వ్యక్తిత్వ వికాస నిపుణులు రచయితలవటానికి ఈ పుస్తకం మార్గదర్శిగా నిలచింది.
ఈ పుస్తకం ప్రచురించిన నవసాహితి బుక్‌హౌస్ అధినేత శ్రీ కొండపల్లి ప్రకాశరావు గారికి, 1996వ సంవత్సరాలనికి ప్రతిష్టాత్మక ప్రచురణకర్తగా అఖిల భారత పబ్లిషర్స్ సమాఖ్య, డిల్లీ వారి నుండి అవార్డులభించింది.
ఈ పుస్తకంపై ప్రచురణకర్తకూ, రచయితకూ కలిపి దాదాపులక్ష ఉత్తరాలు వచ్చాయి. యువతీ యువకుల్లో ఆత్మస్థయిర్యాన్నీ, నమ్మకాన్నీ పెంపొందించటానికి రచయిత సూచించిన పలుమార్గాలు పాఠకుల్ని ఆకట్టుకున్నాయనటానికి ఇంకా ఏమి ఋజువు కావాలి? పాతికేళ్ళ క్రితం ‘వెన్నెల్లో ఆడపిల్ల, ఆనందో బ్రహ్మ’ మొదలైన రచనల ద్వారా నవలా సాహిత్యాన్ని వంటింటినుంచి బయటకు తీసుకు వచ్చి, సాహితీ రంగంలో ఒక కొత్త ట్రెండ్‌కి కారకుడయిన యండమూరి, ఆ పై మళ్ళీ పాతికేళ్ళకి విజయానికి అయిదు మెట్లు పుస్తకం ద్వారా మరో కొత్త ట్రెండ్ సృష్టించటం జరిగింది. పాపులర్ నవలా పఠనం నుంచి పెర్సనాలిటీ డెవలప్మెంట్ వైపు పాఠకుడి దృష్టి మరల్చి వ్రాసిన ఈ పుస్తకం, రెండు కోట్ల రూపాయలకు పైగా అమ్మకాల్ని దాటి రికార్డు సృష్టించింది. ఒక రచయిత తన జీవితకాలంలో ‘‘రెండు రికార్డులు’’ సాధించగలడని నిరూపించే ఈ పుస్తకం, విజయం పై సరికొత్త అవగాహన ఏర్పర్చుకోవటానికి ప్రతి తెలుగువ్యక్తికీ సహాయపడుతున్నది.
విజయ రహస్యాలు, తప్పు చేద్దాం రండి, విజయానికి ఆరో మెట్టు, మైండ్పవర్, విజయంలో భాగస్వామ్యం, చదువు ఏకాగ్రత, విజయానికి అయిదు మెట్లు మొదలైన పుస్తకాలు కేవలం తెలుగే కాదు, కన్నడం, తమిళం భాషల్లోకి అనువదింప బడి, దక్షిణ భారతదేశo మొత్తం సంచలనం సృష్టిస్తున్నాయి.
విజయం ఇచ్చే సంతృప్తికి అవధుల్లేవని ఇప్పుడు ఈ యాభయ్యవ ముద్రణ నిరూపిస్తూంది.
Release date
Ebook: 30 September 2020
English
India