Step into an infinite world of stories
4.2
Fantasy & SciFi
కొన్ని నవలలు పరిచయం చెయ్యాలంటే అదృష్టం ఉండాలి. ఎందుకంటే, ఆ నవల పాఠకుడ్ని తనతో పాటు నడిపించేంత గొప్పగా ఆ రచయిత ’నిర్మించాడని’ అర్థం. ఈ ’జరుగుతున్న జగన్నాటకం’ నవల కేవలం అక్షరాల కూర్పు కాదు. రెండు ప్రపంచాల మధ్య అద్భుతంగా కట్టబడిన వారథి. ఆ వారథిని నిర్మించిన అక్షరశిల్పి శ్రీ సత్యప్రసాద్ గారు. ఈ కథ చాలా చిత్రంగా మొదలౌతుంది. ముగ్గురు స్నేహితుల మధ్య మొదలవుతుంది. హైదరాబాద్ నగరశివారుల్లో జరిగే ఒక రేవ్ పార్టీలో, ఒకరు ప్రసాద్, రెండు మూర్తి, మూడు సారథి. పార్టీలో ఉన్న సారథి అనుకోని పరిస్థుతుల్లో సవ్యలంకలో తేల్తాడు. అదో కొత్త లోకం. ఆ రెండు ప్రపంచాల మధ్యనున్న వారథే ఈ సారథి. అంతేకాదు - పార్థసారథి, ఈ పుస్తకంలో ఖగోళశాస్త్రముంది. జీవశాస్త్రముంది. అనేకానేక సిద్ధాంతాల ప్రతిసిద్ధాంతాల చర్చవుంది. తప్పొప్పుల విచారణ వుంది. మానవ మస్తిష్కపు ఆవిష్కరణ ఉంది. ’ఇది నిజమే, ముమ్మాటికీ నిజమే’ అని సమ్మోహనంగా పాఠకుడిని నమ్మించే ’కల్పనా చాతుర్యం’ ఉంది.
© 2022 Storyside IN (Audiobook): 9789355445629
Release date
Audiobook: 15 May 2022
English
India