Step into an infinite world of stories
ఆంధ్రపత్రికలో వారంవారం తెన్నేటి సూరి గారు రచించిన చంఘిజ్ ఖాన్ అనే ఈ నవల వెలువడుతున్నప్పుడు రచయితను ఒక మితృడు “నువ్వు రాస్తున్నది చంఘిజ్ ఖాన్ జీవితమా లేక వర్తమాన రాజకీయ వార్తల సమీక్షా?” అని అడిగాడట. దానికి బదులుగా రచయిత ‘12,13 శతాబ్దాలలో ఏ రకం కుళ్ళు రాజకీయాలు ఆసియా ఖండంలో వ్యాపించి, చంఘిజ్ ఖాన్ అనే శక్తి ప్రభవించటానికి నాడు కారణమయ్యాయో, అవే రకం కుళ్ళు రాజకీయాలు నేడు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి” అని పుస్తకం ఆరంభంలో చెప్పుకొస్తాడు. 1956లో మొట్టమొదటి సారి ప్రచురింపబడిన ఈ నవల తర్వాతి కాలంలో అనేకసార్లు పునర్ముద్రితమైనది. చంఘిజ్ ఖాన్ దండయాత్రలలో అనేకమండి ప్రజలు హత్యచేయబడిన మాట వాస్తవమే. కానీ చంఘిజ్ ఖానుకు ఎదురైనా పరిస్థితులు ఎలాంటివి? నెహ్రు వంటి వాడు ‘ఛంగీజ్ ఖాన్ నా ఆదర్శవీరుడు’ అన్నందుకు ఉన్న తర్కం ఏంటి? గోబీ ప్రజలకు, ఛాంగీజ్ ఖానుకు మధ్యనున్న బాంధవ్యం ఎలాంటిది? ఛంగీజ్ ఖాన్ అంటే ఎవరు? మానవుడుగా అతను ఎలాంటి స్వభావం కలవాడు? 123 గుడిసెలు, లేక డేరాలు గల ఒక బంజారీ తండా నాయకుడు ప్రపంచంలో ముప్పాతిక వంతు వరకు జయించి మూడు శతాబ్దుల పర్యంతం సువర్ణయుగాన్ని అనుభవించిన ఒక సామ్రాజ్యాని ఎలా స్థాపించగలిగాడు? ఇదంతా సైనిక శక్తి వల్లనే సాధ్యమైందంటే, అలాంటి మహత్తరమైన సైనిక శక్తి అతనికి ఎలా కలిగింది? అలాంటి గొప్ప సైనిక శక్తులను కరగతం చేసుకోగలగటానికి మానవుడిగా అతనిలోఉన్న బలీయమైన గుణసంపత్తి ఏమిటి? - ఇలాంటి ప్రశ్నలకు ఒక గొప్ప నవలా రూపం ఇచ్చి చారిత్రక నవలా పద్దతిలోనే అత్యద్భుతమైన నవల రాసారు తెన్నేటి సూరి.
When the present novel ‘Chenghiz Khan’ was serialized in Andhra Patrika, a friend of the author Tenneti Suri asked him: ‘Is it really the story of Changhiz Khan’s life or is it a commentary on contemporary politics?’. Tenneti Suri writes a reply in the introduction to the novel. He writes, ‘The rotten politics of the 12th and 13th centuries in Asia (that caused the rise of the great power called Chenghiz Khan) are similar to the global politics today.’ Chenghiz Khan was first published as a novel in 1956. It went through innumerable reprints afterwards. It remains one of the best-selling novels in bookshops of the Telugu states. It is true that a lot of people were brutally murdered as part of the military conquests of Chenghis Khan. But what were the situations Chengiz Khan found himself to be in? Why would someone like Nehru say ‘Chenghiz Khan is my hero’? What was the relationship between the people of Gobi Desert and Chenghiz Khan? Who is this Chenghiz Khan? What was he as a human? How could a gypsy leader of 123 huts end up conquering three-fourths of the world? Was it only due to his military strength? - such were the questions Tenneti Suri attempted to answer in this great, unputdownable historical thriller of a novel.
© 2021 Storyside IN (Audiobook): 9789354833410
Release date
Audiobook: 27 August 2021
English
India