Step into an infinite world of stories
5
Non-Fiction
రెండు వేల ఏళ్ళనాడు గుణాడ్యుడు పైశాచీభాషలో గొప్ప కావ్యం రాస్తే అర్థం కాలేదని అవమానించారు. ఆ బాధతో గుణాఢ్యుడు ఎవరికీ అక్కర లేని ఈ గ్రంథం ఎందుకని అడవిలో హోమ గుండాన్ని రగిల్చి, ఆ అద్భుత కావ్యాన్ని ఒక్కొకటిగా చదువుతూ ఆ మంటల్లో ఆహుతి చేస్తుంటే అడవిలోని పశుపక్ష్యాదులు వినడనికి చుట్టూ చేరి ఈ ఘూరకృత్యానికి హాహాకారాలు చేస్తాయి. విషయం తెలుసుకున్న రాజు పరుగు పరుగున చేరి గుణాఢ్యుని కోపం పోగొట్టి ఆ దారుణం ఆపుజేయిస్తాడు. కాని అప్పటికే దాదాపు అయిదు వంతుల భాగం అగ్నికి ఆహుతి అయ్యింది. ఆ మిగిలిన అయిదోవంతుల భాగమే మన పాలిటికి బృహత్కథ. ఈ కె.ఎన్.వై. పతంజలి రాసిన ‘రాజుల లోగిళ్ళు’ కథ అసంపూర్ణ కావ్యాల గురించి అనాదిగా సాహితీప్రియుల హృదయంలో ముల్లును చూపిస్తుంది. చరిత్ర, సంస్కృతుల గతిని పడుగుపేకల్లా అల్లి రాసిన ‘రాజుల లోగిళ్ళు’ అసంపూర్ణంగా మిగిలిపోవడం తెలుగు సాహిత్యానికి తీరనిలోటు. ఒక పూరించలేని అగాధం.
© 2022 Storyside IN (Audiobook): 9789354831669
Release date
Audiobook: 15 May 2022
English
India